పుట:Adhunikarajyanga025633mbp.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నడపుట ఆచారమయ్యెను. ఇవ్విధముగ బాధ్యతాయుత ప్రభుత్వము, ఇంగ్లండునందేర్పడెను.

అమెరికా సంయుక్తరాష్ట్రములుకూడ, ఇంగ్లండుయొక్క ఆధిపత్యమునుండి విడివడి, స్వాతంత్ర్యయుద్ధముచేసి, తుదకు, స్వాతంత్ర్యముబొంది, నూతనరాజ్యాంగము నేర్పరచుటకు ప్రధానకారణము, అమెరికను ప్రజల యంగీకారము లేకనే, బ్రిటిషువారిపార్లమెంటు వారిపై శిస్తుల వేయుటయే! ఇంగ్లాండునందు ప్రజల కిష్టములేని శిస్తుల ప్రభువెట్లువేయుటకు వీలులేదో, అటులనే తమకిష్టములేని శిస్తులను తమపై వేయుటకు, బ్రిటిషు పార్లమెంటున కధికారము లేదని అమెరికనులు వాదించిరి. బ్రిటిషుప్రజల యనుమతిగొనుటకై, సమావేశపరచెనో, అటులనె, తమసమాధానము బొందుటకై, తమకు, పార్లమెంటునందు ప్రాతినిధ్య మివ్వవలసినదని అమెరికనులు కోరిరి. తుదకు అమెరికాసంయుక్త రాష్ట్రసమ్మేళన రాజ్యాంగ మేర్పడినపిమ్మట, ప్రభుత్వమును నడపు ప్రెసిడెంటుగారికి, అవసరమగు ధనమును ఇచ్చుశక్తి "కాంగ్రెసు" వారి కొసంగబడినది. కాన ప్రజాస్వామిక రాజ్యాంగము లన్నిటియందును, ప్రభుత్వాదాయమునకు, ప్రభుత్వములన్నియు శాసనసభలపై యాధారపడియుండును. కాని బాధ్యతాయుత మంత్రివర్గముల కల్గిన రాజ్యాంగములందు, ప్రభుత్వము,