పుట:Adhunikarajyanga025633mbp.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నకు అందుముఖ్యముగా శాసనసభలకు చాలాకాలమునుండి తెలిసినవారై యుందురు. జర్మని, ఫ్రాన్సు, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికాలందిట్లు శాసనసభలు ప్రజానాయకుల పక్షనాయకుల మంత్రిత్వము బొందనర్హులగువారిని తయారుచేయుచున్నవి.

శాసనసభలయొక్క నాయకులు, వక్తలు, జయప్రదమగు మంత్రులగుట సాధ్యమాయని విచారించనగత్యములేదు. మంత్రులు తమకు యేర్పరచబడిన డిపార్టుమెంటులను సివిలుసర్వీసువారివలె నడపుటకాక ఆడిపార్టుమెంటులద్వారా, ఏ యేఫలితముల నెట్లెట్లు ఎంతవరకు ప్రజలకు కల్గించవలయునో, ఎప్పటికప్పుడు తెల్పుచూ సివిలుసర్వీసు యుద్యోగులాయాఫలితముల కల్గించుటకు శ్రద్ధచేయునట్లు చూచుచున్న చాలును. ప్రజలయభిప్రాయములు తమపార్టీద్వారా శాసనసభద్వారా ఎట్లుప్రకటింపబడెనో ఆయభిప్రాయములు సఫలతబొందుటకై వివిధడిపార్టుమెంటులు కృషిచేయుటకు శాసనసభానాయకులుపయోగ పడుదురని, బాధ్యతాయుత ప్రభుత్వములచర్యలు తెల్పుచున్నవి. ఏయేడిపార్టుమెంటుల నెట్టి నియమములననుసరించి నడుపవలెనో నిర్ణయించుట వీరిపనికాదు. ఆపనికి సివిలుసర్విసువారుకలరు.

ఇంగ్లాండునందును, జర్మనీయందును, అప్పుడప్పుడు పార్లమెంటునందుగాక వ్యాపారములందు విశ్వవిద్యాలయము