పుట:Adhunikarajyanga025633mbp.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లక పార్లమెంటునందే స్మృతితప్పిపడిపోయిన లేబరుపార్టీ సభ్యులొక్కరు ఋజువుచేసిరి. అమెరికా, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, ఐరిషుఫ్రీస్టేటు, దక్షిణాఫ్రికా, బాల్కనురాష్ట్రములందును గౌరవభృతిని శాసనసభాసభ్యులకు చెల్లించుటకలదు. మనదేశమందుమాత్రము సభాసమావేశములందు దినభృతికి చాలని భత్యము చెల్లింపబడుచున్నది. ఈ పద్ధతివలన బీదలగుసభ్యులకు అన్యాయమెంతేనికల్గుచున్నది. ఇకముందు లేబరుప్రతినిధులు, నిమ్నజాతుల ప్రతినిధులు గౌరవభృతిలేనిదే ఎటులపని చేయుదురు? న్యాయరీత్యా ప్రతి కౌన్సిలుమెంబరునకు భత్యమునకుతోడు నెలకు రు 250 లు గౌరవభృతిగా చెల్లించు టగత్యము.

VIII

శాసనసభలు గావింపవలసినధర్మములలో ప్రజలకు రాచకీయవిజ్ఞానమును వృద్ధిజేసి, వారికి ప్రభుత్వముయొక్క చర్యల తెలియజెప్పి, ఎప్పటికప్పుడు ప్రభుత్వమువలన కల్గుచుండు మంచిచెడ్డల తెల్పుచుండుట యొక్కటియైయున్నది. ప్రభుత్వమందున్న మంత్రివర్గము, ఏయేరాచకీయకార్యక్రమము ననుసరించుచున్నదో, ఏయేవృద్ధికారకమగు కార్యములజేసి, ఆర్థిక, సాంఘిక, రాచకీయపునర్నిర్మాణ కార్యప్రణాళికను అనుభవమందు బెట్టినదో ప్రజలకు తెలియజెప్పి, మంత్రివర్గము యొక్క చర్యల సమర్థించుచు మెజారిటీయందున్న పార్టీ