పుట:Adhunikarajyanga025633mbp.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1780 వరకు, పార్లమెంటునందు, ప్రభుత్వోద్యోగులుకూడ, సభ్యులుగా నుండిరి. వారెల్లప్పుడు రాజుయొక్క యిష్టానుసారమే వోటుచేయుచు, ఉపన్యసించుచు, ప్రజాప్రతినిధులనెదిరించుచు, ప్రజాప్రాతినిధ్యమును బలహీనతనొందించుచుండిరి. కనుకనే అప్పటినుండి, ప్రభుత్వోద్యోగులెవ్వరును, పార్లమెంటునందు సభ్యులుగా నుండరాదను ఆచారముఆదేశమున అమలులోనికివచ్చెను. ఆసదాచారమే, తదితర దేశములందును అవలంబింపబడినది. మనదేశమందు, "నామినేటెడు సభ్యులు" అందునను, ప్రభుత్వోద్యోగులగు సభ్యులు, అన్ని శాసనసభల యందుండుటవలన, వారెల్లప్పుడు ప్రభుత్వమునే బలపరచచు, ప్రజాప్రతినిధులమాట చెల్లనీయక క్రిందటి పన్నెండువత్సరములందెంత నష్టము కష్టము కల్గించిరో అందరికి తెలిసియే యున్నది. కనుకనే, సైమనుకమీషనువారును రౌండుటేబిలు సభవారును, ప్రభుత్వముచే నియమితులైన వారుకాని, ప్రభుత్వోద్యోగులు కాని, శాసనసభాసభ్యులై యుండరాదని సూచించిరి. ప్రజాప్రతినిధిసభాసభ్యులు, మొగమోటమిలేక, తప్పొనర్చిన, అక్రమముగా ప్రవర్తించు ప్రతియుద్యోగుని, వానిచర్యల విమర్శించుటకు స్వాతంత్ర్య మనుభవించవలయునన్న, ప్రభుత్వోద్యోగులెవ్వరు శాసనసభయందు సభ్యులైయుండరాదు.