పుట:Adhunikarajyanga025633mbp.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యిట్టివారు సంఘకంటకులగుటకు అవకాశము కలదుగాన, అట్టి ప్రత్యేకప్రాతినిధ్యము ప్రజాస్వామికప్రధానసూత్రములకే విరుద్ధమగును. ఈకారణములచేతనే జమీందారులకును ప్రత్యేకప్రాతినిధ్య మొసంగుటవలన, రాజ్యాంగశాంతికే భంగకరమగును. బీదలగువారు సాంఘికముగ దీనులగువారికి వోటుహక్కు నిరాకరించుచో ఎట్టివిపరీతపర్యవసానములు కల్గునో, అట్టి అన్యాయపుపరిస్థితులు, భూస్వాములు, వర్తకులు, ప్లాంటరులకు ప్రత్యేకప్రాతినిధ్య మిచ్చినను సంభవించుట తధ్యము. కాన, ప్రత్యేక ప్రాతినిధ్యము నెవ్వరికైన యిచ్చుట తప్పనిసరి యగుచో, అద్దానిని, తమ్ముతాము రాచకీయముగ రక్షించుకొనలేనివారికే, మితముగా, తాత్కాలికావసరము కల్గినంతవరకు, ప్రసాదించుట యుక్తము.

సిక్కులు, క్రైస్తవులు, యూరపియనులు, మహమ్మదీయులు, హిందువులు, ఏయేరాష్ట్రములం దత్యంతమగు, మైనారిటీలందుందురో, ఆప్రదేశములందు ప్రత్యేక ప్రాతినిధ్య తమ తమ యసహాయతనుబట్టి కోరుచుండుట భావ్యమని, మనదేశపు లిబరలుపక్షపురాచకీయజ్ఞు లెల్లరు తలంచుచున్నారు. గాంధిమహాత్ముడుమాత్రము ఏసంఘీయులకుగూడ ప్రత్యేకప్రాతినిధ్యమే కూడదనియు, ఎల్లసంఘములవారు ప్రజాసామాన్యపు న్యాయపరిశీలనాశక్తి, ధర్మనిరతి, బాధ్యతాయుతనడవడిపై నమ్మకము కల్గియున్ననే ప్రజాస్వామి