పుట:Adhunikarajyanga025633mbp.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కంగారుపడిపోయి "జాతీయప్రభుత్వము"ను బలపరుప పత్రికలచేతను, కన్సర్వేటివుపార్టీచేతను, రాచకీయనాయకులచేతను ప్రోద్బలపరచబడుటచే కన్సర్వేటివు పార్టీవారిని ఎల్ల నియోజకవర్గములందును ప్రజలు బలపరచిరి. తన్మూలమున "జాతీయ ప్రభుత్వపు" అభ్యర్థులందరికి సంపాదితమైన వోటులలోసగమువంతు, లేబరుపార్టీ, లాయడుజార్జిగారి లిబరలు పార్టీలవారికి వచ్చినను, కన్సర్వేటివుపార్టీవారికి 472 స్థానములు, జాతీయ లేబరుకు 13 స్థానములు, జాతీయలిబరలుపార్టీకి 35 స్థానములు, అనగా 520 స్థానములు జాతీయప్రభుత్వమునకును, లేబరుపార్టీకి 52 స్థానములు, లిబరలుపార్టీకి 37 స్థానములు, మిగతావారితో కలిసి, ప్రత్యర్థికక్షిలన్నిటికి కలిసి 95 స్థానములు మాత్రములభ్యమయ్యెను. పైలెఖ్కలనుబట్టి, ఏకసభ్య నియోజకవర్గము లుండునంతవరకు, వానినుండి వచ్చుసభ్యులు, సాధారణమెజారిటీసూత్రప్రకారము యెన్నుకొనబడువరకు , లక్షలకొలది వోటరులకు, తమకు నచ్చినపార్టీవారి అభ్యర్థుల నెన్నుకొనుయవకాశము కలుగకపోగా అనేకమారులు తలవనితలంపుగా ప్రజాబాహుళ్యమునకు అయిష్టము, ఆశ్చర్యమే కల్గించునట్లు ఏయొక్కపార్టీవారో మితిమించిన ప్రాతినిధ్యమును సంపాదించుకొని బాధ్యతాయుతసూత్ర ప్రభావమును వమ్ముజేయుట కల్గుచుండునని తేలుచున్నది.

ఇట్టి విపరీతపర్యవసానముల కల్గించు ఏకసభ్యనియోజకవర్గములకు బదులు, సమిష్టిసభ్యనియోజకవర్గముల నేర్ప