పుట:Adhunikarajyanga025633mbp.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్సునగర రాజ్యమున 'కౌన్సిలు' సభ్యుల యెన్నికలందును, లాటరీ పద్ధతిపై ప్రజాప్రతినిధు లెన్నుకొనబడుచుండెడివారు. అనగా, అభ్యర్థులుగా నుండదలచినవారి లేక పౌరులెల్లరిపేరులను కొన్ని కాగితములమీద వ్రాసి, వానినన్నిటి ముడిచి ఒక బుట్టయందు వేసి, బాగా తిరగత్రిప్పి, పిమ్మట కండ్లకు గంతకట్టుకొనిన బాలకుని చేతనో, మరెవ్వరిచేతనైనగాని, ఎంతమంది సభ్యులగత్యమో అన్ని కాగితముల తీయించెడివారు. ఆకాగితములపై ఎవ్వరెవ్వరి నామములు లిఖింపబడెనో వారిని సభ్యులుగా ప్రకటించెడివారు. ఇందువలన ఈపౌరులు నన్ను బలపరచిరి గాన నావారు, వారు నన్నెదిరించి నాప్రత్యర్థికి తమవోటుని నిచ్చిరిగనుక వారు పెరవారు, విరోధులను విభేదములు కల్గుటకు తావుండెడిదికాదు. మరియు దైవానుగ్రహముపై ఎన్నికఫలితము లాధారపడియుండెను. గనుక, ప్రతిపౌరునకు సబ్యత్వము బొందుటకు ఎప్పుడో యొకప్పుడు అవకాశము కల్గుటకు వీలుండెను. ఇందువలన పార్టీలేర్పడుటకు అవకాశము లేదాయెను. ప్రజలెల్లరు, ఒక కుటుంబీకులమనియు సోదరసోదరీలమనియు బావించి ఐక్యభావముతో పంచాయితీపేరు ప్రతిష్టలు వృద్ధిబొంది గ్రామసౌభాగ్యాభివృద్ధి పొందుటకై కృషిచేయుటకు వీలుండెను. 'ఈలాటరీ' పద్ధతి ఇప్పటికి ముఖ్యమగు అన్ని యెన్నికలందును అన్ని దేశములందును విడనాడ బడినను ఇంగ్లాండు, మనదేశము, బ్రిటిషు ఆధినివేశములందు శాసనసభలలో సభ్యుల బిల్లులు తీర్మాన