పుట:Adhunikarajyanga025633mbp.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షుల సహకారము, త్యాగము, సహాయము యుద్ధభూములందెం తగత్యమో, అంతగా స్త్రీలసహకారము దేశమందు, వాణిజ్య, వ్యాపారాది, సాధారణసాంఘిక జీవితమును నడపుట కవసరమని ప్రజలు తెలుసుకొనగల్గిరి. ఇక కరవులు, కాటకములు వచ్చినగాని, మహామారి, మశూచికములు దాపరించినగాని, ఆర్థికసంక్షోభము కల్గినగాని, రాచకీయవిప్లవము తటస్థించినగాని పురుషులతో సమానముగా స్త్రీలును బాధలననుభవింప వలసియుందురు. స్త్రీలను రక్షించుభారము పురుషులు వహించుచున్నారని కొందరు వాదింతురుగాని, వారిమాట సహేతుకముగాదు. మనదేశమందే వివిధ వృత్తులందు, ఫాక్టరీలయందు పురుషులతోబాటు స్త్రీలును సమానముగా జీవితపోషణ చేయుటకు కష్టించుచున్నారు. వ్యవసాయక కూలీలయందును, స్త్రీలు పురుషులతోబాటు కూలినాలిచేసి ప్రాణముల నిలబెట్టుకొనుచున్నారు. ఇకపాశ్చాత్య దేశములగూర్చి వేరుగ చెప్పవలెనా ? అచ్చట స్త్రీలకు, ఆర్థిక ప్రపంచమందును సమాన ప్రతిపత్తికల్గుచున్నది. ఇట్టి పరిస్థితులందైనను, ఫ్రాన్సుదేశస్థులు స్త్రీలకు వోటుహక్కు నివ్వ నిరాకరించుచుండుట ఆశ్చర్యకరమగు విషయమే కాని, న్యాయపద్ధతిమాత్రము కాజాలదు. రాజ్యాంగ నిర్వహణాధికారము బొందుటకు తగిన విద్య, అనుభవము, కార్యకారితనము స్త్రీలకు లేదని కొందరు ఫ్రెంచినాయకులు వాదించుచు