పుట:Adhunikarajyanga025633mbp.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధారణము విషయమునగు పరిస్థితులుకలుగ కుండుటకే, జర్మనీ, ఆస్ట్రియాదేశములందు సాధారణ శాసనములనుండి రాజ్యాంగ విధానపుచట్టసవరణ శాసనములవరకు, నియమబద్ధమై ప్రజలముందు 'రిఫరెండము'నకు పెట్టబడవలయునను యేర్పాటుకలదు. కనుక ప్రజలు, ప్రభుత్వము, ప్రజాప్రతినిధి సభవారు అంగీకరించిననే పౌరసత్వహక్కులలో మార్పులుకలుగ జేయబడును. మానవమాతృలగు నల్గురో, పదిమందో జడ్జీలకు ఎట్టికాలానుసారమగుమార్పులు రాజ్యాంగవిధానమందు, పౌరసత్వపుహక్కులందు కలుగజేయవలెనో నిర్ణయించు అధికారమిచ్చుటవలన, ప్రజాక్షేమము సురక్షితమగునని చెప్పజాలము. సాధారణముగానట్టి న్యాయమూర్తులు పూర్వాచార పరాయణులు, సంకుచితాభిప్రాయములు, ఆచారబద్ధులు, వృద్ధులునైయుందురు. కాలగతిననుసరించి, ప్రజాభిప్రాయము, ప్రజల యాచారములగణించి, తగునట్టి అభివృద్ధికారమగు మార్పుల జేయుటకు వారుత్సాహులైయుండరు. అట్లిట్లనరాని విధమున, కనుమూసి, కనుతెరచునంతలో అపారమగు సంచలనము బొందుచున్న ఆధునికసాంఘిక సౌధమునకు తగినట్లు పునాదుల బలపరచి, లావణ్యముచేకూర్చుటకు, అల్పసంఖ్యాకులగు న్యాయమూర్తులైన వృద్ధులు తగరు. అట్టిసౌధమునకు తగురీతి, ఎప్పటికప్పుడు, జీవనాభివృద్ధి కల్గించుమార్పుల కల్గించుటకై ప్రజలు, వారిప్రతినిధిసభవా