పుట:Adhunikarajyanga025633mbp.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాని, శాసనసభలయందు సభ్యత్వములు బొందుటకు వీలులేదు. వారాసభలకు బాధ్యతజెంద నగత్యములేదు. ఇటులనే కాంగ్రెసునకు అతీతమై, ప్రెసిడెంటుతో సంబంధము లేకయే, న్యాయస్థానము లేర్పరచబడియున్నవి. ఈవిభజన వలన కల్గుబాధలు "అమెరికా ప్రభుత్వము" నందువివరింపబడినవి. కాంగ్రెసుపై ప్రెసిడెంటు ఆధారపడకుండుటవలన, కాంగ్రెసువారు తగినంతబాధ్యతకల్గి, తాత్కాలికావసరములకు వలయు శాసననిర్మాణము జేయుటకు, ప్రభుత్వావసరములకు అవసరమగు శిస్తుల వేయుటకు, ఉత్సాహపడజాలరు. అటులనే, తాము ప్రతిపాదించు శాసనముల కాంగ్రెసువారు అంగీకరింతురను నమ్మకము లేదు. శాసననిర్మాణకార్యక్రమునకు ప్రభుత్వము పూనుకొనదు. తాను తలపెట్టుకొన్న కార్యక్రమవిధానమును సాగించుటకు వలయుపన్నులను కాంగ్రెసు వేయునను ఆశ లేకుండుటచే, ప్రెసిడెంటెల్లప్పుడును నూతనకార్యనిర్వహణమునకు పూనుకొనజాలడు. పైగా ప్రెసిడెంటును, కాంగ్రెసు ప్రజలచే యెన్నుకొనబడును కనుక ఒకరిజూచిన మరొకరికి ద్వేషాసూయలుపెచ్చు పెరుగును. ఈ యిబ్బందుల తగ్గించుటకు, అప్పటినుండి (1800) యిప్పటివరకు వృద్ధిజెందుచుండిన రెండు రాచకీయపార్టీలు చాలవరకు సాయపడినవి. ఇంగ్లాండునందెట్లు రాజు, మూడుప్రభుత్వాంగములపై సమానమగు యాధిపత్యమువహించియు