పుట:Abraham Lincoln (Telugu).pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శంబుగ నిచ్చుచుండును. పైరుచుల పచరించు బాలురకును నతనికిని ఇదియ భేదము. వారు చదువుదురు; అచ్చటన వారి పని ముగియును. వారావిషయమున శ్రద్ధజేయుట లేదు. చెప్ప బడినవిషయ మేల చెప్పబడియె? దీని మూలకారణ మెద్ది? యను చర్చ వా రెన్నడు జేయుట లేదు. కావున జదివినవిషయముల జాఱవిడుచునలవాటు పట్టవడును. తమకు దామ యోచించుకొనుట వా రెఱుగరు. ఇతరులు నంది యనిన వారికి నంది; పంది యనిన వారికి బందియె యగు: వా 'రిట్లు జరుగుచున్న' దని తెలిసికొనిన జాలునని సంతసింతురు. ఏల జరగుననుసంశయముతో వారికి బనిలేదు. ఆబ్రహా మట్టివాడు గాడు. తాన యోచించు స్వబుద్ధిచే బరిశీలించు. ఇదియ యాతని మన:శక్తి నత్యద్భుతముగ వృద్ధిసేయ గల్గెను.

ఈ మార్గదర్శిక 'పురోహితుల' విషయము జదువరు లిక కొంచెము వినవలయును. అందు గొందఱ మహాశక్తి యుతు లుండినను సాధారణముగ వారు విశేషము విద్య గడించినవారు గారు. కళాశాలలును విద్యాలయములును వా రెఱుంగరు. అయిన దైవికజ్ఞాన మితరులకు గలుగ జేయ వారుత్సుకులయి యుందురు. ఈశ్వరుం డట్టికార్యము దమకు విధించెనని వారు గట్టిగ నమ్మి నిర్మలహృదయు లై పని బూనుచుందురు. ఒక యశ్వమును బుస్తకముల సంచియు