పుట:Abraham Lincoln (Telugu).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ రెండుసాధనముల దెచ్చుచు నాబి "నాయనా! నేన పోగరవట్టి రంధ్రములు సేయ గలుగదు."

"అబ్బీ! నీవాకార్య మొనర్ప జాలవు. ఈ పెద్దమొద్దుల రెండంగుళములు దొలుచుట గష్టము. నీవు వెడలి కోడునకుగా నొక్కకొయ్యయు దానిపై నుంచుటకు రెండుపట్టెలను సంపాదింపవలసినది."

"అంతమాత్రమ చాలునా?"

"అంతే అదిగొ! యామూలన దాని నిర్మించెదను. రెండుప్రక్కల గోడమొద్దులు పట్టెలవలె నుండనే యున్నవి. రెండురంధ్రములుమాత్రము వానియందు జేయవలసి యుండును. ఒకకోడుమాత్రమె నిలుపవలసి యుండును. మఱి రెండుపట్టె లారెండుకన్నముల నుండి యాకోడు పైకిదెచ్చి యద్దానిపై బిగించిన జాలును. ఈపనియంతయు నొక గంట కాలమునకంటె నెక్కుడు పట్టదు."

ఇంట నొకవైపున పరుండస్థానము నియమించుకొనుట జేసి పని యంత విశేష ముండదాయెను. పైన జెప్పినవిధమున గోడ మొద్దుల బొడవున నెనిమి దడుగులమీదను వెడలుపున నాలుగున్నర యడుగులమీదను రెండురంధ్రములు సేసి రెండు పట్టెల వానిలో దూర్చి యొకకోడు మీదికి దెచ్చి బంధించి వేసెను. ఇ ట్లిది ముగిసినతోడనె థామసు: