పుట:Abraham Lincoln (Telugu).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాసులకు బెట్టునది పిడికెడు కూడు, తొడగించున దొక ముతుకగుడ్డ, కట్టిపెట్టున దొక రాతిగొంది, యనుభవింప జేయునది సంకెళ్ల మోతయు, కొరడాదెబ్బలరుచియు. ఇవన్నియు యజమానికి వ్యయములేక దొరకుచుండును. పశువుల కర్చుకంటె బానిసలకర్చు తక్కు వగుట బానిస వ్యాపారము రానురాను మిక్కిలి యధికమాయెను. ఎచ్చటి జనులను దారిదప్పించి శరణరాహిత్యుల జేసి దొంగలించుకొనివచ్చి యీ సీమల నమ్ముచుంట సాధారాణమయ్యెను. ఇట్టి యమానుషపు గృత్యముల మొదలంట నశింపజేయ నుద్యమించి యుత్తర సీమలవారు ప్రయత్నములు సేయనారంభించిరి. కొన్ని దక్షిణ సీమలు దమ పూర్వ ఘోరాచారముల వదలి "ముక్తసీమ" లగుచు వచ్చెను. మఱికొన్ని సంయోగమునుండి దొలగి పోవసిద్ధపడెను. బానిస వ్యాపారమున కడ్డుపడకూడదని మహా యల్లకల్లోలములు జరిపెను. అయిన దుట్టతుదకు మానవునందడగియుండు దైవికాంశము పైకిలేచి యయ్యాసురప్రవర్తన దుదముట్టింప సమకట్టి యుత్తరదక్షిణసీమలకు యుద్ధమువెట్టి దక్షిణసీమల బరాజితుల జేసితనపని దీర్చుకొనెను. ఇది సులభసాధ్యము కాదాయెను. అనేకులు మహాత్ములీపనికై, దమ యుసురుల దొరగవలసివచ్చెను. అయినను "ధర్మోజయతి" యనువాక్యం బెప్పటికైన గల్ల యగునే. ఎంత ప్రబలుడైనను