పుట:Abraham Lincoln (Telugu).pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లింకనునుగుఱించి నుడివిన వాక్యములలోని ముగింపుభాగముతో మనమును ముగింతుముగాక.

"నాయకశిఖామణీ! ఇక సెలవొసంగుము. పోయివచ్చెదము. దేశ మంతయు నిను వీడ జాలక దు:ఖించు చున్నారు. అయిన నేమిచేయనగు. దేవునియాజ్ఞ యైనది. మాకోరిక లిపుడు పనికిరావు. నిన్ను మే మెప్పుడును మఱువము. దేశమున దల్లులు దమ కుమారులకు నీపేర మొదట గఱపుదురు గాత. మన బాలురెల్లరు నీగుణముల సంపాదింప బ్రయత్నింతురుగాక. రాజ్యనిర్వాహకులు నీ జేసిన కార్యముల గని జ్ఞానము సెందుదురుగాత. పెదవులు గదలలేకున్నను నీమాట లింకను మాకు వినవచ్చుచున్నవి. నీ వదనమునకు జలనము లేకున్నను దానినుండి యుద్భవించిన స్వాతంత్ర్యమున కగు వాక్కుల ఛాయ లోకమునందెల్ల ప్రౌడముగ విననగుచు బానిసల నలర జేయుచున్నది. కాలుడు నిను నిర్బంధించి నట్లగుపడుచుండినను గీర్తిచే నీ స్వేచ్ఛమై లోకమునందెల్ల సంచరించుచున్నాడవు. నీ చావు నీకొఱకు గాదు; నీ సంహారకుడు నీపై వైరమూనడయ్యెను. మనములు గట్టివైచి మాజాతీయత సంహరింప నతడును నతనివారును సమకట్టిరి. అయిన నీప్రాణములైన నర్పించి మాయిడుమల దప్పించినందులకు మాయుద్ధారకుండుగ మేము నిను బూజించు