పుట:Abraham Lincoln (Telugu).pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చుండెను. మూడు దినములమీదట నాపురము లోబడియెను. శత్రువులు చెల్లాచెద రైరి. పట్టువడిన ప్రదేశము నాం గెలిచినవారు వందిహారావములతో జయభేరులు మ్రోయించుచు వందిమాగధబృందపరీవృతు లై యట్టహాసనమున జేరుచుందురు. లింకను మాత్రము సర్వసాధారణముగ వీథులంబడి నడచి మన:పూర్వకముగ లోబడియుండిన డేవిసు కార్యస్థానముంజేరి యా పురముం గొనెను. అత డింత సాహసమున శత్రువుల యూరుసొచ్చి స్వామిద్రోహి వదలిపోయి యుండినగృహముననె రెండుదినము లుండెను. దేశ భక్తు లంద ఱత డేమి యగునో గదా యని కంప మందుచుండిరి. అనేకు లతడు మూర్ఖ సాహసమున నాకార్య మొనర్చె నని తెగడిరి. అతడు మరలివచ్చి వాషింగ్టను చేరె నని వినిన వెంటనె యెల్లరును హర్షం బందిరి.

రిచ్మండు లోబడెనని సంతసమున దేశమంతయు బండుగ లనుభవించిరి. ఉపన్యాసములును, సంగీతములును, ఘంటా రావములును, బాణసంచులును, దీపావళులును, లోకుల యానందంబును వెల్లడించెను. ప్రతిచోటను జనులు లింకనును స్మరించి యతనిబుద్ధిని, దేశభక్తిని, కార్యనిర్వాహకత్వమును వేనోళ్ల బొగడిరి.

ఈ యుత్సవములు జరుగుచుండగనే రిచ్మండు పట్టువడిన వారము కాలమునకు 'దిరిగుబాటు' నాయకుడు లీ పరా