పుట:Abraham Lincoln (Telugu).pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డెను. అపరాధ మియ్యలేనందున నాతని నట్టె పట్టియుంచిరి. కావున నతనిపరముగ గొంగఱు లింకనుం డాసి యతని మన్నించి విడుదలసేయుమని వేడుచు నతనినుండి గుండె గఱిగించుబత్రము నొక్కదానిని దెచ్చిరి. ఆజాలి వుట్టించు జాబు చదివి లింకను "ఈలేఖ నాభావముల నాకర్షించుచున్నయది. శరణుసొచ్చి దయకు బాత్రులమని విన్నవించువారల కేను లోబడుట నాలోపమని యెఱుగుదు. ఈయపరాధి మనుష్యు డెప్పుడు సేయనట్టి క్రూరహత్య చేసియుండినను నీమొ ఱాలకించి విడుతును. అయిన నితడు నాలుగు డాలర్ల కాశించి దక్షిణాఫ్రికా కదేపనిగ వెడలి యాదేశపు గన్నులుదెఱవని కూనల దొంగిలించి వారినెల్ల నంత్యములేని వరవుడమున కమ్మ సాహసించిన మహాహతకుడు; గారాగృహంబున గుళ్లి ప్రాణములు విడిచిన విడుచునుగాక, నాక్షమాపణ నెన్నటికి నందజాల డనుట నిత్యము నిస్సంశయము నిర్ధారితము." అనెను.

యుద్ధము సంపూర్తి యయినతరువాత లింకను నీగ్రోలకు దెల్ల వారలతో సమానముగ రాజ్యాంగ విషయముల సమ్మతు లిచ్చు నధికార మిచ్చుటకు దీర్మానించె ననుటయు వారియెడ నతనికి గల యాదరణ దెల్లమగుచున్నది.

లింకనున కొకతఱి గొప్ప స్వాగతమీబడెను. తెల్లవారంద ఱతని దర్శించి చనినపిదప నీగ్రో లొకరితరువాత నొకరు