పుట:Abraham Lincoln (Telugu).pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జూచుచు నతని లోకువను స్మరింపజేయ నెడమియ్యకుండెనని డగ్లసు నుడివియున్నాడు.

ఒకనాడు వాషింగ్టను పౌరు డొకడు దేశాధ్యక్షుని కార్యస్థానముం జేరి యత డాదేశపు నోట్ల గొన్నిటి లెక్కపెట్టుచుంట గాంచెను. లింక నాతనిం గాంచి "ఈ పని నాదేశాధ్యక్షతకు సంబంధించిన సాధారణపు గార్యములలోనిది గాదు. రాజాంగపు జట్టదిట్టములచే విధింపబడని పను లనేకములు దేశాధ్యక్షుడు సేయవలసి యుండు" ననియెను.

ఆ పెద్దమనుష్యు డుచితవిధి నంగీకారము సూచించి యా కార్యమున నెట్టి విశేషముగలదో యెఱుగ నిచ్ఛ గాన్పింపజేసెను.

"ఈ ద్రవ్యము కోశప్రకరణమునకు జేరిన యొక పేదనీగ్రో ద్వారపాలకునిది. అత డిప్పుడు మశూచికముచే మిక్కిలి వంతలందుచు వైద్యశాలయం దున్నాడు. చేవ్రాలు సేయ నశక్తు డగుట నతడు జీతము గొన ననర్హు డయ్యెను. కావుననే నాయిక్కట్టుం దీర్ప మిక్కిలి శ్రమపడి తుట్టతుదకు బారిభాషిక గష్టముల దరింప నతని వేతనముం గొనగంటిని. ప్రస్తుతము దాని నాతని యిచ్చచొప్పున బంచిపెట్టు చున్నాను. అం దొక్కభాగమును నాచేతన నొక సంచియందుంచి పైన పేరువ్రాసి దాచవలె నని యాతని కోరిక యై