పుట:Abraham Lincoln (Telugu).pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యగు. దాస్యము వలయుసీమలు తిరుగుబాటుసీమలుగ నుండు. తిరుగుబాటున నుండుటంజేసి వానియందలి దాసులకు నీపత్రపు నధికార ముపయోగింపబడును. ఏవిధమునైన నీగ్రోలు ముక్తి గాంతురనుటను లింకను గ్రహించి యుండెను. కావున నతని మార్గమే కాలోచితముగ నుండె ననుటకు సందియము లేదు.

ఇక లింకను నీగ్రోలకు జూపిన దయానురాగంబులును వా రతనికి గనుపఱచిన గారవప్రేమలును వెల్లడిసేయు విషయముల గొన్నిటిం దెల్పెదము.

సొజర్న డనునొక నీగ్రోస్త్రీ ముదుసలి మిషిగను నుండి గడుదూరము లింకనును జూడ నేతెంచెను. లింకను దన కుర్చీనుండి లేచి మన:పూర్వకంబుగ నాపెకు స్వాగతమిచ్చి "మిము గాంచి మిక్కిలి సంతోషించితి"నని నుదువుచు నాసనంబున గూర్చుండుడని సమ్మానించెను.

"దేశాధ్యక్షా! తాము మొదట నీపదవి నందినతోడనె మిము నసురులు సించివైతు రని నామనము భయం బందెను. అట్లు జరుగకుండ దైవము మిము గాపాడుం గాత మని వేడి, నను నతడు సజీవిగ నుంచిన మీ దర్శనము సేసికొందునని నిర్ణయించితిని. నా యిచ్ఛ దేవు డిప్పటివఱకు నాలుగు సంవత్సరములు నెఱవేర్చి యున్నాడు. నా కోరిక దీర్చుకొనుదము గా కని వచ్చితి" నని యా యబల పల్కెను.