పుట:Abraham Lincoln (Telugu).pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయిన నిశ్చయ మావంతయైన లేని వెడగుమాటల నమ్మి నేబనిబూనువాడను గా" నని నిర్భయముగ బలికి వారిని బంపివేసెను.

ఫిరంగి యొక్కటి క్రొత్తగ జేయబడెను. దాని బరీక్షించుటకుగా నొక కొందఱు సీమప్రతినిధి సభ్యులు నియమింపబడిరి. వా రావిషయమును విపులముగ నేబదిపుటలు నింపి వ్రాసిపంపిరి. లింక నాగ్రంథముం జూచి "వీ రిందుల గొంచెము జ్ఞాన ముపయోగించి విషయముల సంక్షిప్తముగ దెలుపవలదే? గుఱ్ఱమును బరీక్షింపుడనిన దాని రోమముల లెక్కించునట్టి బుద్ధిమంతులుగ నున్నారు. నే నిది సదుపుకొన మఱియొకజన్మ మెత్తవలసినదే" యనుచు దాని బల్లపై బాఱవైచెను.

నౌకా సేనాధికారు లిద్దఱు వ్యాపారుల నన్నదమ్ముల రాజ్యాంగపు ధన మపహరించిరని వారిపై నేరముమోపి కారాగృహమున నుంచి నెలలకొలది పీడించుచుండిరి. లింక నావ్యాజ్యెమును బరిశీలించి యన్నదమ్ము లిరువురును నిరపరాధు లని తెలిసికొని తానే యధికారము పూని,

"ఈ యిరువురును నౌకా సేనవిషయమున లక్షయిరువది యైదువేల వ్యాపారము జరుపు చుండిరి. అం దిరువదియైదువే లపహరింప వారి కెడ ముండెను. వారిపై నేరము మోపినది