పుట:Abraham Lincoln (Telugu).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాసికపై సులోచనముల జత యతని కలంకారముగ నొప్పుచుండును" (ఈవర్ణన విని ప్రతిసభ్యుడును వాబాషు ప్రతినిధింజూచి వర్ణితాంశములు సూటిపడుట గమనించెను) "ఆ ముదుకడు ఒకనాడు ప్రాత:కాలమున నిదుర లేచి బయటికివచ్చి యింటిముందఱి చెట్టుమీద నొక యుడుతంగాంచితి ననుకొనియెను. కావున దన చేతితుపాకి గొని దాని గాల్చెను. ఆయుడుత దీనికి లక్ష్యపెట్టినట్లు గనుపించ దాయె. అతడు మరల నొకమారు గాల్చె. ఫలంబు మొదటియ ట్లె యుండె. కాన నావృద్ధు మఱిమఱి గాల్చుచుండె. పండ్రెండుమాఱులు గాల్చి వేసవి ఫలసిద్ధి మార్గము గానక తుపాకి గ్రిందిడి ప్రక్కన నిలిచి చూచుచుండిన తన కుమారునితో "అబ్బాయీ! ఈ తుపాకి చెడినట్లున్నది" యనెను. వాడు తుపాకి బరీక్షించి చూచి "ఇం దేమియు దోషము గానరాదే. మీ యుడుత యెక్కడ" నని ప్రతిప్రశ్న సేసెను. దాని కా ముసలివాడు సులోచనముల దృష్టిసారించి చూచుచు "నీకు గనుపించ లేదా? చెట్టునడిమి కెగ బ్రాకినదే" యనెను. "లేదు నా కగుపడలే ద"నుచు నా బాలుడు దనతండ్రి ముఖముసూచి "ఓహో! తెలిసె. మీ ముక్కద్దముపై నుండు నొక పేనుం జూచి చెట్టుమీది యుడుత యనికాల్చుచున్నా ర"నియెను