పుట:Abraham Lincoln (Telugu).pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుచ్చు ప్రొద్దెల్ల నితడు విద్యాభివృద్ధికై వెచ్చించెను. పగలు కొల్తపనిలో నుండునపుడుగూడ నతని మనము పుస్తుకములపై నుండును. తత్కారణముగ రాత్రి జదివినది పగలు పున:పఠనము గావించుచుండెను. కాయపుష్టి పూర్తిగ గలవాడు గాన నత డెంతపరిశ్రమ జేసిన నంతంత యనురక్తి దానియం దతనికి బుట్టుచుండెను.

ఆబ్రహాము దననియామకుల యోగక్షేమమును గుఱించి చట్టనిర్మాణసభలో సంపూర్ణహృదయముతో బనిచేసినందున వారు మరల 1836 వ సంవత్సరమున నతనినే నియమించు కొనిరి. ఇప్పటికతడు మిక్కిలి యభివృద్ధి జెందియుండెను. అతని యుపన్యాసము లుత్తమపదవి జేర నారంభించెను. అప్పటిసభయందలి నియమితసభ్యులును గొప్పవారేయై యుండిరి. బానిసలవిషయము చర్చ కేతెంచెను.

బానిసతనము నిర్మూలము చేయగోరువారు పత్రికల వ్రాసి యన్నిదిశలకు బంపుచు, ముక్తసీమలయందు బానిసపు బాపములగుఱించి యుపన్యసించుచు, నెచ్చట జూచిన బానిసలగష్టముల వర్ణించుచు బలువిధముల బాటుపడుచుండిరి. 'సీమదొరతనము' వారుగూడ వీరి నణప జూచుచుండిరి. ఇల్లినాయియందును వీరి జూచిన నల్లకల్లోలము గావించు చుందురు. వీరిలో ముఖ్యుడగు 'లవ్జాయి' యను నతడు