పుట:Abraham Lincoln (Telugu).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంవత్సరము 1376 సమ్మతులవలన ననగా నిందఱు జనుల కోరిక ననుసరించి యాబ్రహాము సంపూర్ణగౌరవమున బ్రతినిధిగ బేర్కొన బడియెను. నిర్వాచకులకు ననగా సమ్మతి నిచ్చువారికి నాకాలమున సారాయితో బండుగలు సేయుట యాచారమైనను నాబ్రహా మట్టిపని దలంచినవాడుగూడ గాడు.

ప్రతినిధిగ బేర్కొనబడి సభకు బోవుటకు దగు నుడుపులు లేనివాడగుట నొక స్నేహితునివద్ద కొంతధన మప్పు పుచ్చుకొని తగువేషము ధరించెను. సభయం దతడు దన నియామకుల విషయముల నెల్ల జక్కగ జర్చించుటకు దత్పూర్వమే మిక్కిలి శ్రద్ధజేసి వానిని సంపూర్ణముగ నరసి తెలిసికొనెను. సభయం దతిశయముగ మాటలాడకున్నను గొప్ప యల్లకల్లోలములు జరుగు సమయముల వాని నాపుటయం దిత డనన్యసామాన్యు డాయెను.

ఈ తరుణమున నాబ్రహాము స్టూఅర్టను నొక గొప్ప న్యాయవాదితో గలసిమెలసి దిరుగుచుండెను. అత డీ చిన్నవానిశక్తి యపారమని గ్రహించి 'నీ వేల న్యాయవిద్య నభ్యసింపరా దని' యడిగెను. ఆబ్రహా మెప్పటివలె వెనుదీసెను. అయిన స్టూఅర్టు మిక్కిలి ప్రోత్సాహపఱచి తా బుస్తుకము లిచ్చెదననిచెప్పి యాబ్రహామును సంమ్మతింప జేసెను. న్యూసే