పుట:Abraham Lincoln (Telugu).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చట్టనిర్మాణసభకు బ్రతినిధిగ నియమింపబడ నిలువుమని నన్ను స్నేహితు లనేకులు నిర్బంధపఱచిరి. నా రాజకీయవిషయి కాభిప్రాయములు తక్కువ యై యింపైనవి. జాతీయనిధి యొకటి యుండవలె ననియు, స్వదేశములోపలిపనుల వృద్ధిసేయవలె ననియు, గొప్పసంరక్షణ సుంకముల వేయవలె ననియు గట్టిగ నమ్మువాడను. నా రాజకీయవిషయిక యభిప్రాయములును, న్యాయములు నివి. మీరు నన్ను బ్రతినిధిగా నేర్పఱచిన గృతజ్ఞుడనై యుండెద; నేర్పఱచ కున్నను నా కొక్కటియ."

ఇంతటి చిన్న యుపన్యాసమునకు గారణ మతని నిగర్వ మనియే నుడువ నగును. ఈవిషయ మతని నిర్వాచకు లనగా సమ్మతు లిచ్చువారు గమనింపకుండలేదు. అతడు నియమింప బడకపోయినను విజయమందిన యుద్యోగార్థి కితడు రెండవ వా డాయెను. ఇతనికి వచ్చిన సమ్మతుల సంఖ్యయు నతనికి వచ్చిన వానికంటె గొన్నిమాత్రము దక్కువగా నుండెను. ఆబ్రహాము నెడ నితరులకు గల గౌరవము న్యూసేలములలోని 284 సమ్మతులలో 2.7 సమ్మతు లతడు సంపాదించె ననివని దెల్లము గాగలదు.

ఆబ్రహాము కెదురుపక్షమువా రతని యాకారవేషముల జూచి పరిహసింపుచుందురు. అట్లు పరిహసించుటకు గొన్ని