పుట:Abraham Lincoln (Telugu).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనులంద ఱావిషయమున మిక్కిలి యుత్సుకు లై యుండుట చేత బ్రతి పల్లియయందును నొక పటాలము చేరుచుండెను. న్యూసేలములో బలవంతు లగువార లనేకు లుందురని యది వఱకే నుడువబడియెను. వారి దుర్మార్గముల బాపి సన్మార్గమున బ్రవర్తింపజేసిన లింకను దన బలౌన్నత్యముచె వారి కందఱకు నాయకుడు గాదగి యుండెను. వారివారి శౌర్యధైర్యముల జూపి దేశము గాపాడికొన సమయ మిదెయని లింకను ప్రోత్సాహమున నచట నొక పటాలము సిద్ధమాయెను. నాయక నియామకముమాత్ర మచట జరగలేదు. అయిన నీవిషయమున గొప్పచర్చ ప్రారంభమాయెను. ఫిట్జుపాట్రిక్కను మఱియొక డాబ్రాహముతో నాయకత్వమునకు బెనగుచుండెను. జనరంజకత్వము గలవాడే యైనను ఆబ్రహాము నెదుట నిలువలేకపోయెను. నిర్ణీతస్థానమున నా యుద్ధభటులు నాయకుని గోరుకొన సెలవొసంగ బడిరి.

లింక నొకప్రక్కన పాట్రిక్కతనికెదురుగ నిలుచుండిరి. యుద్ధభటులలో బ్రతివాడును దా గోరుకొను నాయకుని జేరి నిలువవలసినదని యుత్తరువు సేసిరి. వెంటనె ముప్పాతిక మంది లింకను జేరిరి. గొప్పసంఖ్య లింకనుప్రక్క కుఱుకుట జూచి తక్కినవారు దామును అతనియండకు మఱలిరి. పాట్రి --------------- అతని జూచిన జాలి వేయుచుండె