పుట:Abraham Lincoln (Telugu).pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జొచ్చిరి. నాటినుండి యట్టి దుర్మార్గప్రవర్తనము గూడదని ఖండించి లింకను వారినెల్ల మంచిపౌరుల జేసెను. నవీనాగతుల కష్టము లంతటితో దీరిపోయెను. సత్పౌరులసంఖ్యయు నెక్కుడాయెను. సంస్కరింపబడిన జాకు మొదలగువారు లింకను నెడ భక్తిగలిగి యతనికి శిష్యభావమున మెలగుచుండిరి. దీనికి దార్కాణ మొండు గలదు. ఒకదినము పరదేశీయు డొక డాగ్రామమునకు వచ్చెను. అతడు ధూర్తుండై జాకుతో గలహమునకు సమకట్టెను. అంత జాకు గోపమున "నీవు పేలవు కల్లరి" వని యతనినో నాడెను. అత డాగ్రహమున నొకకొయ్యతో వాని నడచెను. ఇద్దఱును పెనగ నడుము గట్టుచుండిరి. దీని నాబ్రహాము గాంచి యచటి కేతెంచి విషయము విచారించి జాకునకు దప్పు జూపెట్ట వా డంగీకరించెను. తరువాత వారిరువురకును సంధి జేసి మైత్రి గలిపెను.

ఆపుట్టు గిడ్డంగిదారుగా నున్నపుడు లింక ననేక లాభముల బొందెను. మైళ్లుమైళ్లు నడచి సభలకు బోయి రాజకీయోపన్యాసము లొసగుచు జర్చ లుపక్రమించుచు వాక్పాటవదోరణుల సంపాదించెను. ఉడుపులకైన వెచ్చపెట్టక ధనము గూర్చి యొకవార్తాపత్రిక దెప్పించుకొని చదువుచుండును. అంగడిపని లేనప్పుడంతయు విద్యాసంపాదనపరుడై యతడు కాలము గడపెను.