పుట:Abraham Lincoln (Telugu).pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆ మార్చినెల మొదటిదినముల నిర్ణీతస్థలమున నాపుట్టును జూచుటకు నీ త్రిమూర్తులు వెడలి యతని గాంచిరి. అతదు ప్రథమమున నాబ్రహామును జూచి వెఱ గందెను. జాన్ చెప్పినమాటలవలన లింక నందఱకంటె బొడవు గలవాడుగ నుండునని యతడు దలంచెనేగాని భీమబలు నెదుట గాంచెదనని యొకనాడును ననుకొన డయ్యెను. గాన నాజానుబాహు నాబ్రహాము గని విస్మయ మందెను. అయిన గొంతసేపటి కా యాశ్చర్యపు ననలు సంక్షిప్తములై స్నేహాంకురములు బయలు వెడలెను. అంతట దనపనివారల గలయజూచి "మనరేవున నేటికి పడవ సిద్ధముగ నుండు ననుకొంటిని. అది యింకను నాయత్తము గాలేదు. ఏమిచేయుటకును దోచకున్న యది" యనియెను.

అందు కాబ్రహాము "పడవ నొకదాని నిర్మింతుముగా" కని స్ఫుటముగ బల్కెను.

ఆపుట్టు ముదమున "నిర్మింప నెఱుగుదువే" యని యడిగెను.

"మూడువారములలోపల మేముముగ్గురమును నాపనిని దీర్చెదముగాక. నా కోడలగట్టుట చక్కగ దెలియు" నని ప్రత్యుత్తర మొసగెను.