పుట:Abraham Lincoln (Telugu).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూడి సీతమ్మగారును భాషాభివృద్ధికై మిక్కిలి పాటుపడియున్నారు. వీరుగాక పూర్వ మొకప్పుడుండిన పురుషార్థప్రదాయిని, ఆంధ్రాభాషాసంజీవని, మందారమంజరి, చింతామణి, శ్రీవైజయంతి మొదలయిన మాసపత్రికలును, బ్రస్తుత మున్న సరస్వతి, మంజువాణి, మనోరమ, సువర్ణలేఖ, సావిత్రి, హిందూసుందరి, జనానాపత్రిక మొదలయిన మాసపత్రికలును, ఆంధ్రప్రకాశిక, శశిలేఖ, కృష్ణాపత్రిక, ఆర్యమతబోధిని, సత్యవాది, రవి మొదలైన వార్తాపత్రికలును, తెనుగునం దొకవిధమైన యుపయోగకరంబగు వాజ్మయంబును బుట్టించినవి, బుట్టించుచున్నవి. వీరివ్రాతలలో వ్యక్తి (Individual) విషయికనిందాపూరితంబు లగునవి కొన్ని తప్ప కడమవన్నియు నేమతమును బోధించునవియైనను నుపయోగకరంబులే. కాన నేతద్గ్రంధకర్తలందఱును మనకు వంద్యులు. మే మిచ్చట బేర్కొనినవారు గాక యనేకభాషాభిమానులు లాంధ్రవాజ్మయాభివృద్ధి (Improvement Of Telugu Literature) కై పాటుపడుచున్నారు. వారును మాకు గౌరవనీయులే. వారి యందఱినామము లిచ్చట నుదాహరించుటకు మాస్మరణశక్తియు జోటును జాలవు గాన వారు మమ్ము మన్నించుదురుగాత.

ఇట్లిందఱు పాటుపడుచుండగా 'మన తెలుగువారు నిద్రపోవుచున్నారు' ని మేము వ్రాయుట చదువరులకు వింతగ నుండు నేమో. కాని తెలుగుబాస యొక నాగరికభాష యనిపించుకొనుటకు మనము చేయవలసినప్రయత్నములో నిప్పుడు జరిగియున్నప్రయత్న మొక సహస్త్రాంశమైనను కాదని తెలిసికొనిన మనము నిద్రపోవుచున్నది మేల్కాంచినది తెలియగలదు. మనభాషయం దేగ్రంథములు లేవో మనము విచారించిన మనము ముందు చేయవలసిన కార్యముయొక్క చాయ కనుపడగలదు. ఇండియా, ఇంగ్లండ్, గ్రీస్, రోమ్, అమెరికా, ఫ్రాన్‌స్ ఈదేశములచరిత్రలు మనభాషయందు లేవు. హిందూదేశచరిత్ర మనుపేరిట నొకటి రెండు చిన్నపొత్తములు గలవు. కాని వానిలో వర్ణింపబడినవిషయములు బహు