పుట:Abraham Lincoln (Telugu).pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ యఱపులకు నీగ్రోలు జడియరైరి. ఎప్పటియట్లు మరల నిశ్శబ్ద మావరించెను. తమకడ సాధన మొక్కటియైన లేకుండుట సూచి యాబి ధైర్యము పూని యొకదుడ్దుకఱ్ఱ దీసికొని ప్రాణమునకై పోట్లాడవలె నని నుడువుచు మహారావమున "ఎవడురా దుర్మార్గు డని" యఱచెను. దానికి బ్రత్యుత్తరములేనందున నింకను భయంకరముగ నదేవిధమున నఱచెను.

"దుష్టవర్తనులారా! ఏల మీ రిచటి కేతెంచిరి? మరలి చనిన మే లగు. లేకున్న నిదె మిము జలముల కాహుతి యొసంగెద" నని యాగ్రహమున బల్కుచు శరాసనంబు నుండి విడువబడిన బాణంబువోలె చీకటియనక రివ్వున వారిపై కురికెను.

కొంతకాలము గఱ్ఱలతో యుద్ధము జరిగెను. తరువాత దగ్గరదగ్గర చేరి ముష్టియుద్ధమే ప్రారంభమాయెను. సమరము మిక్కిలి ఘోరమై రక్తముల వెల్లువల కావాసమై ఫల మేమగునో యెఱుంగరాక పదినిమిషములవఱ కొక్క పెట్టున బ్రబలసాగెను. తుట్టతుద కాబ్రహాము శత్రువులలో నొకని బ్రవాహంబున ద్రోసె. తక్కినవారెల్ల నీట దుమికి పలాయితు లయిరి.

"వారి వెన్నంటి దఱిమి చంపుదముగా" కని భయంబెల్ల బోదోలి యాబ్రహా మాలెను లరమై లా నీగ్రోల