పుట:Abhinaya darpanamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ముఖాముఖేరంగవల్యాం పాదసంవాహనే౽పిచ.

337


సర్వసమ్మేళనేకార్యే మందిరే ఛత్రధారణే,
సోపానేపదవిన్యాసే ప్రియాహ్వానే తదైవచ.

338


సఞ్చారేచ ప్రయుజ్యేత భరతాగమకోవిదైః,

తా. స్త్రీవిషయము, చెక్కిలి, క్రమము, మర్యాద, వెరపు, వాదు, అలంకారము, ఉనికిపట్టు, త్రిపుండ్రము పెట్టుకొనుట, ఎదురెదురు, ముగ్గు, కాళ్ళు పిసుకుట, అన్నిటిని కూర్చుట, ఇల్లు, గొడుగు బట్టుకొనుట, మెట్టు, అడుగుపెట్టుట, ప్రియులను బిలుచుట, తిరుగుట వీనియందు ఈహస్తము వినియోగించురు.

గ్రంథాంతరస్థమృగశీర్షహస్తలక్షణమ్

ఊర్ధ్వగశ్చతురాంగుష్ఠో మృగశీర్షకరః స్మృతః.

339


శివం ప్రతితపః కర్తుం ధారయిత్వా త్రిపుణ్డ్రకమ్,
మృగశీర్షో౽భవద్గౌర్యాః ఋషిరస్య మృకండుజః.

340


ఋషిజాతి శ్శుభ్రవర్ణో౽ధిదేవస్తు మహేశ్వరః,

తా. చతురహస్తాంగుష్ఠము వెలుపలి కెత్తఁబడెనేని మృగశీర్షహస్త మౌను. మహేశ్వరునిగూర్చి తపస్సు చేయుటకు పార్వతీదేవి త్రిపుండ్రమును ధరింపఁగా ఈహస్తము పుట్టెను. ఇది ఋషిజాతి. దీనికి ఋషి మార్కండేయుఁడు. వర్ణము తెలుపు. అధిదేవత మహేశ్వరుఁడు.

వినియోగము:—

భిత్తావిచారే సమయే ఆవాసే ఛత్రధారణే.

341


పద్మిన్యామపిశంఖిన్యాం హస్తిన్యాం మందవాచకే,
లేపనే చందనాదీనాం స్త్రీణామభినయక్రమే.

342