పుట:Abhinaya darpanamu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శము, ప్రేరితము, ఉద్వేష్టితము, వ్యావృత్తము, పరివృత్తము, సంకేతము, చిహ్నము, పదార్థటీక అని హస్తజప్రాణములు పండ్రెండు.

1. ప్రసారణము:—

ప్రసారణమితిజ్ఞేయమఙ్గుళీనాం ప్రసారణాత్.

190

తా. వ్రేళ్లను జాఁచుట ప్రసారణ మనఁబడును.

2. కుంచితము:—

కుఞ్చనాదంగుళీనాంచ కుంచితం సముదీరితమ్,

తా. వ్రేళ్లను ముడుచుట కుంచిత మనఁబడును.

3. రేచితము:—

అంగుళీనాం ప్రచలనా ద్రేచితం పరికీర్తితమ్.

191

తా. వ్రేళ్ళను గదలించుట రేచిత మనఁబడును.

4. పుఙ్ఖితము:—

పురోభాగే కుంచితోవా రేచితో వా ప్రసారితః,
యోహ స్తస్తుపతాకాదిర్నామ్నా౽సౌ పుఙ్ఖితో భవేత్.

192

తా. పతాకాదిహస్తములందు వ్రేళ్లు ముందరికి వంచుట, కదలించుట, చాఁచుట అను నిట్టిది పుంఖిత మనఁబడును.

5. అపవేష్టితము:—

అధస్తాద్ధమనంయస్య హస్తోనామ్నా౽పవేష్టితః,

తా. వ్రేళ్లను క్రిందుగా చాఁచుట యనెడి హస్తప్రాణము అపవేష్టిత మనఁబడును.

6. ప్రేరితము:—

పశ్చాద్భాగేకుఞ్చితోవా రేచితోవా ప్రసారితః.

193


యోహస్తఃకథితస్సోయంప్రేరితః పూర్వసూరిభిః,