పుట:Abhinaya darpanamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తా. వ్రేళ్ళను విరళముగఁ ద్రిప్పినయెడ అలపల్లవహస్త మవును. ఈయలపల్లవహస్తము పూర్వము పాలు వెన్నలు దొంగిలించిన కృష్ణునివలనఁ బుట్టెను. ఇది గంధర్వజాతి. దీనికి వసంతుఁడు ఋషి. శ్యామమువర్ణము. సూర్యుఁడు అధిదేవత.

వినియోగము:—

హైయంగవీనే విరహే మౌళౌమోదకభావనే.

360


ఫుల్లపద్మేచ మంజర్యాం కిరీటే వర్తులే౽పిచ,
శ్లాఘాయాం రూపసౌందర్యే నర్తనే దుర్గసౌధయోః.

361


ధమ్మిల్లే చంద్రశాలాయాం మాధుర్యే సాధువాదనే,
నియుజ్యతే తాళఫలే హస్తో౽యమలపల్లవః.

362

తా. అప్పుడు కాఁచిన నెయ్యి, విరహము, తల, కుడుమును జూపుట, వికసించిన తామరపువ్వు, పూగుత్తి, కిరీటము, వర్తులము, శ్లాఘించుట, ఆకృతి, చక్కదనము, నర్తనము, కోట, మేడ, కొప్పు, మేడమీఁదియిల్లు, మాధుర్యము, బాగు బాగు అనుట, తాటిపండు వీనియందు ఈహస్తము వినియోగించును.

21. చతురహస్తలక్షణమ్

తర్జన్యాద్యాస్త్ర యశ్శ్లిష్టాః
కనిష్ఠా ప్రసృతా యది,
అంగుష్ఠో౽నామికా మూలే
తిర్యక్చే చ్చతురఃకరః.

363

తా. తర్జని మొదలైన మూఁడువ్రేళ్ళను జేర్చి చిటికెనవేలును చాఁచి అంగుష్ఠమును అనామికమూలమం దడ్డముగ నుంచిపట్టిన చతురహస్త మగును.