పుట:Aandhra kavula charitramu muudava bhaagamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వక్కలంక వీరభద్రకవి.

ఈకవి కూచిమంచి తిమ్మకవి జగ్గకవుల కాలములోనే పిఠాపురమునందుండి మిక్కిలి ప్రసిద్ధిగన్నవాడు. కూచిమంచి తిమ్మకవి వలెనే యితడును దెందులూరి లింగనారాధ్యుని శిష్యుడయి తన వాసవదత్తా పరిణయమునం దాతని నిట్లు స్తుతించి యున్నాడు -