పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

థములతో పాటు అతని గ్రంథములగూడ దగ్ధముగావించిరి. ఈతని పాండిత్య మహిమయు, కీర్తియు, జీవితమును చీనా, తిబెతు గ్రంథములవలన దెలియవచ్చుచున్నది. ఈతనివలె బౌద్ధులయిన సుప్రసిద్ధాంధ్రు లనేకులు, స్వదేశమును విస్మరింపు టెంతయు శోచనీయము. ఇది బ్రాహ్మణమత ప్రభావముకాని వేఱుకాదు. మలయగిరిప్రాంత మీభావవివేకుని జన్మభూమియని దెలియుచున్నది. మలయగిరి యనగా నిప్పటి విశాఖపట్టణ మండలములోని పశ్చిమభాగమని గాని, వింధ్యపర్వతపంక్తియొక్క తూర్పు కొనయనిగాని భావింపవచ్చును. ఈతడేకాలపువాడో తెలిసికొనుట కాధారములులేవు, గాని యీతనిశిష్యులు నాగార్జునునికిని, దిజ్ఞాగునికిని నడుమ కాలమున జీవించి యుండినట్లు యీచింగ్ చెప్పియున్నాడు. యుఆన్‌చ్వాంగ్ వ్రాసిన దానిబట్టి, భావవివేకుడు శిలభద్రునికి గురువగు ధర్మపాలుని కించుక సమకాలీనుడని తెలియుచున్నది. ఈతడు రచించిన మహాయన ముఖ్యహస్తశాస్త్రమను గ్రంథము చీనాభాషలోనికి భాషాంతరీకరింపబడియున్నది. దానిని యు ఆన్ చ్వాంగ్ చీనా దేశమునకు తిరిగి వెళ్ళినతరువాత క్రీ.శ. 648 వ సంవత్సరమున భాషాంతరీకరించెను. ఈ గ్రంథము భావవివేకుని యఖండతార్కికశక్తితో విరాజిల్లు చున్నది. ఇందాతడు బౌద్ధమతములో నన్ని సంప్రదాయముల వారియొక్కయు, శాఖలయొక్కయు సిద్ధాంతముల విమర్శించుచు వ్రాసెను. సాంఖ్యసిద్థాంతమునుగూడ నాతడు