పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకు వ్యాఖ్య రచింపబూని ధ్యానపరుడై సమాధియందు ప్రవేశించి నపుడును, తనయొక్క జన్మ రాహిత్యము కొఱకు బ్రయత్నించి నపుడును, మంజు శ్రీ బోధిసత్త్వు డీతనికి బ్రత్యక్షమై యుపదేశము గావించి, యాతని నాస్వార్థ పరత్వమునుండి, బోధిసత్త్వుని మార్గమునకు ద్రిప్పెనని చెప్పబడి యున్నది. ఈకధ లోనివిషయము, దిజ్ఞ్నాగాచార్యుడు హీనాయన సంప్రదాయమును వదలి మహాయన సంప్రదాయము నవలంబించు సమయముగా అర్థము చేసికొనవలయును. దిజ్ఞ్నాగునివలె, పూర్వము వసుమిత్రు డనువాడు గూడ దేవతలచే అర్హతుడు గాకుండ, బోధిసత్త్వుని మార్గమునకు మరల్ప బడెనట. ఏలనన అర్హతుడైనవాడు హీనాయన సంప్రదాయము ననుసరించి, జన్మ రాహిత్య ఫలమును బొందునుగాని బోధిసత్త్వుడై లోకము నుద్ధరింపడు. లోకమునకై తనప్రాణ మర్పించలేడు. బోధిసత్త్వుడైనవా డుత్తరభూమి యందు బుద్ధుడగునని మహాయన సంప్రదాయము.

యుఆన్‌ చ్వాంగ్ ఆంధ్రదేశమును సందర్శించునాటికి మనదేశమున దొరికిన శాసనముల బట్టి, యా కాలమున వేంగీమండలమును పూర్వచాళుక్యాన్వయుడు మొదటి జయసింహవల్లభ మహారాజు పరిపాలించుచుండినట్లు తెలియుచున్నది. క్రీస్తుశక మేడవ శతాబ్దాదివఱకు నాంధ్రదేశములో వేంగీవిషయము విష్ణుకుండినవంశపు రాజులును, కృష్ణకు దక్షిణ భాగమును, చిల్లరపల్లవ రాజకుటుంబములును, కళింగదేశ