పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వర్ణించినాడు. నాగార్జు నాచార్యునిగూర్చి, యీదేశమునందును, చీనా తిబేతు దేశములందు చెప్పుకొనబడుచున్న గాధ లన్నియు నించుమించుగా నొక దాని కొకటి సరిపోవుచున్నవి. నాగార్జునుడు తాను సర్వజ్ఞడనని, జలపూరితమైన పాత్రను దేవుని కడకు బంపెననియు, నందు దేవుడు సూదిని, జాఱవిడచి, యాతని సర్వజ్ఞత్వమును ఛేదింప గల్గితినని సూచించి గర్వభంగము చేసెననియు, కొందఱు వాదిందుతురు. కాని చివరకు దేవుడు, తన యాజ్ఞానమును, అహంకారమును, తెలిసికొని పశ్చాత్తప్తుడై శిష్యునిగా ననుగ్రహించి యుపదేశింపుమని నాగార్జునుని వేడుకొనుటచే, నాగార్జునుని సర్వజ్ఞత్వము స్థిరపడుచున్నది. శాతవాహనుడను రాజు తన రాణియొక్క దుస్తంత్రమునకు లోనై యామె కడగొట్టు కుమారుడు సుశక్తి యను వానికి రాజ్యము కట్టబెట్టుటకై నాగార్జునుని జంపించి, యాతడు మరణించిన కాలముననే తానును మరణించెనని చీనా యాత్రికుడు ఈ చింగ్ కూడ చెప్పియున్నాడు. నాగార్జునుని ప్రాణముతో, తన ప్రాణము కూడ పోవునని యెఱింగనవాడగుటవలన, రాజు ఆతని మఠముచుట్టు, రక్షణార్థము కావలివారినుంచెను. నాగార్జునుడు చిరకాల జీవియనుటకు తిబేతు దేశ గ్రంథములుగూడ సాక్ష్యముగనున్నవి. తారానాధు డొకచోట[1] నాగార్జునుడు 529 సంవత్సరములు జీవించెనని చెప్పియున్నాడు. చీనా

  1. Tarranatha's History of Buddhism p. 73