పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

౧౭

యాకాలమున కళింగరాజధాని యగు కళింగ నగరమని బిలువబడుచుండెను. కళింగదేశ నామము పూర్వ యుగములందు గంగానదీతీరముననున్న మిథిలా దేశము మొదలుకొని గోదావరి వఱకుగల దేశమున కెట్లుపయోగింప బడుచు వచ్చెనో, యట్లే యాదేశపు రాజధానియు పాలించిన రాజవంశముల బట్టి యనేక తావులందు నిరూపింప బడుచున్నది. బుద్ధునికి బూర్వము దంతిపురము రాజధానిగా నుండెనట. ఈదంతిపురమే రాజమహేంద్రవరమని కన్నింగ్‌హ్యామ్‌గారి యభిప్రాయము[1]; కాని యిది తృప్తికరముగ లేదు. గోదావరిమిాదనున్న రాజమహేంద్రవర మాదిగా నగరములెన్నియో కళింగ రాజధానులుగ ప్రాచీన కాలమునుండి ప్రసిద్ధి కెక్కెను. కాని మనయాత్రికుని కాలమున గంజాము మండలములోని శ్రీకాకుళము తాలూకాలోని కళింగ పట్టణము, సింహపురము, కళింగనగరములలో నేదోయొకటి రాజధానియై యుండ వలయును. ఈ నగరములన్నియు వరుసగా వంశధారనది మిాద మొదట ముఖలింగనగరము తరువాత సింహపురము చివర కళింగపట్టణము నున్నవి. రాజధాని కళింగనగరము. రేవు వంశధార ముఖద్వారమునున్న కళింగపట్టణము. కడపటిదే దంతిపురము కావచ్చును. ఈ నగరములన్నిటి యందును పురాతన బౌద్ధచిహ్నములు, మఠములు మొదలగునవి

  1. Ancient Geography of India p.515,