పుట:Aandhra deishamu videisha yaatrikulu.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

స్వదేశమునకు బయలుదేరినట్లు యాతడు వ్రాసిన వానినిబట్టి తెలియుచున్నది.

దేవరాయలు తన్ను జంపుటకు జరిగిన యాప్రయత్నమునందు బాల్గొన్నవారందఱిని చిత్రవధపాలుచేసెను. విజయనగరమిట్టి దురవస్థలో నుండగా భామినీసుల్తానగు రెండవఅల్లా యుద్దీను డీసమాచారము నంతయుగూడ చారులవలన నాకర్ణించి, ధూరుడై యేడులక్షల దీనారములు కప్పము బంపవలసినదనియు, లేకున్న రాజ్యముపై దండెత్తి రాగలననియు వర్తమానమంపెను. రాయలా బెదరింపులకు జంకక, సైన్యమును గూర్చుకుని భామినీ రాజ్యముపై దండెత్తిబోయి మద్దకల్లు కోటనుగొట్టి రాచూరు, వెంగాపురపుకోటలను సాధించి, సాగరు బిజాపురము వఱకును గల తురుష్క రాజ్యమును గొల్లవెట్టుచు దేశమునల్లకల్లోలము చేసివైచెను. ఆయుద్ధములో మహమ్మదీయులకు విశేషముగా బ్రాణనష్టము సంభవించెననియు తుదకొండొరులకు హానికలుగజేసుకొనకుండ సంధిచేసుకొని యెవరిరాజ్యములకువారు వెడలిపోయిరని ఫెరిష్టావ్రాయుచున్నాడు; గాని యది నిజమని విశ్వసింపజాలము. అబ్దుర్ రజాక్, ఆసమయమున, దేవరాయల యాస్థానమునందుండిన వాడగుటచే, నతడు దేవరాయల బ్రాహ్మణ మహాప్రధాని కలబరిగె రాజ్యముపై దండెత్తి, తురుష్కసేనలను జయించి విజయలక్ష్మీ సమేతుడై తిరిగివచ్చుచు, కొందఱి దురదృష్టవంతులగు