పుట:Aananda-Mathamu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

ఆనందమఠము


శ్వాసము క్రమక్రమముగా అధిక మగుచు వచ్చెను. భవానందుఁడునాడిని పట్టిచూచెను. నాడి గతి గానవచ్చెను, తుదకు క్రమక్రమముగా ప్రథమపూర్వ ప్రభాత రాగము వికాస మగు నట్లు ప్రభాతపద్మినీ ప్రథమో న్మేషమువలెను, ప్రథమ ప్రేమా నుభవమువలెను, కల్యాణి కన్నులు దెఱువ నారంభించెను.అంత భవానందుఁ డాయర్ధ జీవిత దేహంబును గుఱ్ఱముపై నిడికోని నగరంబునకుఁ బోయెను.


పదునెనిమిదవ ప్రకరణము

మహేంద్రాదులు కారాగృహవిముక్తు లగుట,

సాయంకాల మగునంతలో సంతానసంప్రదాయస్థు లందఱును, సత్యానంద బ్రహ్మచారియును, మహేంద్రుఁడును ఖైదీ లుగా నగరంబునకుఁ గొంపోవంబడి కారాగారంబున నుంచ బడినారని తెలిసికొనిరి. అపుడు ఒక్కొక్కఁడై ఇద్దఱిద్దఱై, పదేపిపదెసి మందియై, నూర్గురునూర్గురై, దేవాలయముచుట్టును దాఁగియుండిన సంతాన సంప్రదాయస్థు లందఱును వచ్చి యా యరణ్యమును జేరిరి. అందఱును శస్త్ర పాణులై యుండిరి. వారి నయనంబు లయందు రోషాగ్నియు, ముఖంబున దంభమును, అధరంబునఁ బ్రతిజ్ఞయు నిండి యుండెను. మొదట నూర్గురు, పిదప వేగురు, ఆమీఁద ఇరువేగురు, ఇల్లు జనసంఖ్య వృద్ధి యగుచుండెను. అప్పుడు భవానందుడు మణి ద్వారమున