పుట:Aananda-Mathamu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

ఆనందమఠము


నీవు నాకై విలపించుచున్నా వని నాకుఁ దెలియును. విలపింప నక్కఱ లేదు, నీవు న న్నె ట్లుంచి యుంటివో యాస్థితియందే నేను సుఖియై యున్న దాన' ననెను.

జీవానందుఁడు ముఖ మెత్తి కన్నీరును దుడిచికొని భార్యను గాంచి, 'శాంతీ! నీ కీశతచ్ఛిద్ర మలినవస్త్ర మొప్పునా? నీకు భోజనమునకు నేమియుఁ గోఱఁత లేదుకదా' యనెను.

శాంతి, నీధనము నీకోఱకయ్యే యున్నది నే నాధనము నేమి చేయుదును? ఏమియుఁ దోఁచ లేదు. నీవు వచ్చి నన్ను మరల గ్రహించినచో——

జీవానంద—— గ్రహింతును, 'శాంతీ! ని న్నిపుడు పరిత్యజించితినా?'

శాంతి—— త్యాగము కాదు——ఎపుడు నీవ్రతము సాంగ మగునో! ఎపుడు నన్ను ప్రేమింతువో, ఈమాట ముగింపు కాకమునుపే జీవానందుఁడు శాంతిని గాఢాలింగనముఁ జేసికొని ఆమె భుజముపై శిరంబు నిడి చాలసేపు నిర్విణ్ణుఁడై యుండి, నిట్టూర్పు నిగుడించి 'నే నేల ని న్నిపుడు చూచితిని!' అని పరితపించెను.

శాంతి—— ఏల చూచితివి? నీవ్రతమును భంగపఱుప లేదుకదా?

జీవానంద—— వ్రతభంగమైనఁ గానిమ్ము —— దానికి ప్రాయశ్చిత్తము కలదు. దానికై చింతింప వలసినది లేదు. నిన్నుఁ జూచిన పిమ్మట వెనుకకుఁ బోలేను, కావుననే నేను నిమాయిని 'పిలిచికొని రావద్దు, నిన్నుఁ జూచి మరలి పోఁజాల' నని చెప్పి యుంటిని, ఒక్క ప్రక్కను ధర్మార్థ కామ మోక్ష జగత్సంసార