పుట:Aananda-Mathamu.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము

85


సెకుపోయి, 'వదినే, వదినే, లే! లే! ' యనెను. అప్పుడామె నూలు వడకుచుండెను.

వదినె—— ఏమి నిన్ను నీమగఁడు కొట్టినాఁడా యేమి? గాయమునకు నూనె పెట్టవలయునా? యనెను.

నిమి——అవు నవును, నూనె యున్నదా?

వదినె—— నూనెదుత్తను జూపి యెత్తుకొ మ్మనెను.

నిమి, అందున్న నూనెను తుడిచి వదినె తలకు చరిమి దువ్వి, 'నీవు కొత్తచీరెను కట్టుకొని రా, యనెను,

వదినె——ఏమే నీకు పిచ్చి పట్టినదా! నే నెట్లున్న నేమి, కొత్తచీర లేదు, పో; వచ్చెద' ననెను.

నిమి, వదినెను లేపి, వీపుపై తట్టి, “రా వదినె, కొత్తచీర యెత్తికట్టుకో' అనెను.

తమాషాకు ఆ యువతి కొత్తచీరను దీసెను. ఇంతటి కష్ట కాలమునను తమాషా చేయువృత్తి యామె హృదయము నందు లుప్తము కాలేదు. నవీనయావనము ఫుల్ల కమలతుల్యమైన నవవయస్సౌందర్య మాలా గుండెను. నూనె లేదు, గుడ్డ లేదు, అయినను సౌందర్యము ప్రదీప్తముగ నుండెను, అనను మేయసౌందర్యము, ఆశత గ్రంథి యుక్తవసన మధ్యమునం దును ప్రకాశమానమై ప్రస్ఫుటితమై యుండెను. వర్ణమునందు శ్యామలము. నయనములందు కటాక్షము. అధరమునందు హాస్యము, హృదయమునందు ధైర్యము. ఆహారముమాత్రము లేదు; అయినను, శరీరలావణ్యము కొఱఁతపడ లేదు. మంచి వస్త్రము లేదు. సౌందర్యము సంపూర్ణముగా అభివ్యక్తమై యుండెను. మఱియు మేఘమధ్యంబున మించువలెను,