పుట:Aananda-Mathamu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

ఆనందమఠము


నిమి, బిడ్డ నెత్తికొని వంటయింటికిఁ బోయెను. తుమ్మ రేకులవంటి అన్నమును, కందిపప్పును, అపుడుకాచిన నేయియును, ఇంక నేమేమో పచ్చళ్ళును తీసికొనివచ్చి జీవానందునికి వడ్డించెను. జీవానందుఁడు భోజనము చేయుచు, 'నిమి ! నీ వుండుచోటు క్షామ' మని యెవరు చెప్పుదురు?

నిమి——క్షామము మాకును వచ్చును. అయినను, వర్షము కురిసినది నీకు దెలియదా? నీవు పోయిన వెంటనేకదా కురిసినది, మా పొలములన్ని యు బాగుగా పండెను. అయినను మే మిద్దరము పక్షులవలె నున్నారము, కసుక మాకు చాలదా యేమి? ఎవరైనను ఎడప తడప వచ్చినచో వారి కింత పెట్టి మే మింత తినుచున్నాము. అదియునుగాక, అందఱును ధనాశ చే పండిన ధాన్యమును నగరమునకుఁ దీసికొనిపోయి అమ్మి వేసిరి. మేము అమ్మక యున్నాము.

జీవా—— నీవదినె యెక్కడ ?

నిమి, తలవంచుకొని మెల్లఁగా—— రెండుమూఁడుపళ్ల బియ్యము తీసికొని పోయెను, బియ్య మెవ రిత్తురు ?

జీవానందునికి యిట్టి యన్నము చాల దీనములనుండి దొరక లేదు. ఇది వానికి అదృష్టసమయ మని తోఁచెను. వాఁడు వృథామాటలచే 'కాలము గడుపుట కిష్టము లేక గబగబ భోజనము చేసెను. శ్రీమతి నిమాయిమణి తనకును తనమగనికిని వలసినంత వంట చేసి యుండెను. ఆకులో నేమియు లేనందున నిమాయి యేమియు తోఁపక మగని భాగమును దెచ్చి వడ్డిం చెను. నిమాయిమణి, 'అన్నా ! ఇంకేమైనను గావలయునా?'యనెను.