పుట:Aananda-Mathamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

ఆనందమఠము


నుంచికొని గొంతునొక ప్రక్క వంచికొని వచ్చి నిలిచి, 'అన్నా రాట్నమును త్రిప్పుచున్నా వేమి? ఈబిడ్డ యెక్కడిది? నీకు బిడ్డలే లేరుకదా! మరల పెండ్లి చేసికొంటివా యేమి?' అనెను.

జీవానందుఁ 'డాబిడ్డను అయువతి చేతి కిచ్చి మెల్లగా మైచఱచి, “ఏమమ్మా నాకు ఇంకొక పెండ్లాముకూడ కావలయునా! ఇద్దరాండ్రు గలవారి బ్రతుకుచూచియుండ లేదా? ఆది పోనీ, ఇంటిలో పాలున్నవా?” యనెను.

యువలి——పాలు లేకేమి, పుచ్చుకొంటావా !

జీవానంద—— కానీ, పుచ్చుకొనేద.

అంత, నాయువతి పాలుకాచుటకై వడిగా వెడలిపోయెను. జీవానందుఁడు పాలు వచ్చునంత వఱకును రాట్నమును ద్రిప్పు చుండెను, ఆయువతి, బిడ్డను ఎత్తుకొన్నది మొదలు ఏడువలేదు. బిడ్డ యేమని తలంచికొనెనో చెప్పుటకు కాదు. అపుడు వికసించిన పుష్పసదృశురా లైనయా యువతిని జనని యని భావించి యుండునేమొ. 'ఇద మిత్ఠ' మని మనము నిర్ణయించి చెప్పలేము. పాలు కాచుచుండఁగా సెగ తగిలి మఱోక తేప యేడ్చెను.

ఆ యేడ్పును విని, జీవానందుఁడు, 'ఓనిమా! ఇంకా పాలు వెచ్చనఁ గా లేదా?' యనెను నిమి, 'ఆయె' నని చెప్పి పాలును ఱాతి మరిగెలో పోసి తెచ్చెను, జీవానందుఁడు కృత్రిమకోపముతో, ఈ వేఁడిపాలను నీమీఁదనే పోయుదునా!” యనెను.

నిమి——ఈ పాలెవరికి?

జీవానంద—— ఈబిడ్డ త్రాగు నేమో యిచ్చి చూడుము.