పుట:Aananda-Mathamu.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

64

ఆనందమఠము


కల్యాణి—— పుచ్చుకొనవలయుననియే తెచ్చితిని. అయినను——ఏమోచెప్పుట కాలోచించుచుండెను. మహేంద్రుఁడు ఆమె ముఖమును జూచుచుండెను. ఒక్కమాఱు కన్ను మూసి తెఱుచుట యనునది ఒక్క సంవత్సరమువలె బోధ మగుచుండెను, కల్యాణి మాట ముగించలేదు, కనుక మహేంద్రుఁడు ఆమెను జూచి——ఏమో చెప్పుటకు ప్రయత్నించితివికదా, చెప్పు మనెను.

కల్యాణి —— పుచ్చుకొనుటకు నిశ్చయించితిని—— అయినను, తామును సుకుమారియు నుండఁగా, వైకుంఠమునకుఁ బోవుట కష్టము లేదు. నేను చచ్చుట లేదు.

ఇట్లు చెప్పి కల్యాణి విషకరాటమును క్రిందనుంచి యిర్వురును భూతభవిష్యత్సంబంధమైన మాటల నాడందోడంగిరి. మాటలచే నిర్వురును అన్యమనస్కులై యుండిరి.

ఈయవకాశ మధ్యమునం దాడుచున్న బిడ్డ విషకరాటమును తీసికొనియుండును. సుకుమారి తినుబండమని భావించి డబ్బిని చేతఁబట్టుకొని క్రిందుమీఁదుగా త్రిప్పి త్రిప్పిచూచుచుండఁగా మూఁత తెఱువఁబడి విషగుళికలు నేలపైఁ బడియుండును, అందొక దానిని బిడ్డ నోటిలో వేసికొనియుండు నని వారిమాటలచే మనకుఁ దెలియుచున్నది. 'లేక, డబ్బినే నోటిలో వేసికొని కోఱికి నదో యేమో, ఏదియు నిశ్చయముగాఁ జెప్పుటకు వీలు లేదు కదా !

కల్యాణి —— ఏమి తింటివి ! కొంప మునిఁగినదే ఏమీ చేయుదును ? అని బిడ్డనోట్లో వ్రేళ్ళు వేసెను. బిడ్డ నోరుమూసి కొనెను. అందువలన విష ద్రవము కడుపులోనికి పోయెను.