పుట:Aananda-Mathamu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవప్రకరణము

57


డెను. నిన్నటిరాత్రి వీరు కొల్లగొట్టి తెచ్చిన రూపాయల నెంచి సరిగా నుంచుచుండిరి. సత్యానందుఁడు ఆమందిరమునకుఁ బోయి, 'జీవానంద ! మహేంద్రుఁడు వచ్చును. వచ్చినయెడల సంతాను లై నమనకు మహోపకార మగును. ఏలయన అట్లు వచ్చినయెడల వారి పెద్దలనాఁటినుండి సంపాదించిన ధనరాశి మహామాత సేవకు అర్పితమగును. అయినను వాఁ డెన్ని దినములదాక త్రికరణశుద్ధిగా మాతృభక్తుఁడు కాకుండునో అంతవఱకును వానిని గ్రహింపఁగూడదు.మీపనియైనమీఁద మీరు భిన్న భిన్న సమయములలో వాని ననుసరించి, అనుకూలమైనప్పుడంతయు శ్రీవిష్ణు మంటపమునకుఁ బిలిచికొని పోవలయును. మఱియు, ఎట్టిసమయమునం దైనను సరియే, వాని ప్రాణరక్షణమునందు జాగరూకత కలిగియుండవలయును. ఏలయన, సంతానులకు దుష్ట శాసన మెట్లు కర్తవ్యమో, అట్లే, శిష్టరక్షణమును గర్తవ్య మైన ధర్మమై యున్న' దని చెప్పెను.


పండ్రెండవ ప్రకరణము

మహేంద్రుఁడు భార్యతోఁగూడ పయనం బగుట.

మహేంద్రుఁడు మిగుల ప్రయాసముతోఁ గల్యాణి యున్న చోటికి వచ్చెను. కల్యాణి చాలా సేపు ఏడ్చెను. మహేంద్రుఁడును రోదనము చేసెను. ఉభయులును కన్నులు