పుట:Aananda-Mathamu.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునోకండవ ప్రకరణము

55


జూడుము. పదాశ్రితు లైన విర కేసరులు శత్రునిపీడనమునందు నియుక్తులై యున్నారు. ' హేదిగ్భుజ!' అని చెప్పుచు గద్గదకంఠుడై కన్నీరొలుకుచుండి, కొంతవడికి యీదిగ్భుజ నానా ప్రహరణధారిణియు, శత్రుమర్దనియు, వీ రేంద్రపృష్ఠహారిణియు నై యున్నది. ఈమె దక్షిణ పార్శ్వమునందు భాగ్యస్వరూపిణి యగు మహాలక్ష్మి యున్నది. వామపార్శ్వము నందు విద్యా విజ్ఞానదాయినియైన వాణియున్నది. మఱియు, సమీపమునందు బలపరాక్రమసంపన్నుఁడైన కార్తికేయుఁడు, కార్యసిద్ధిదాయకుఁడైన గణనాథుఁడు నున్నారు. రమ్ము. మన మిర్వురమును మహామాతకు ప్రణామము చేయుదము” అని చెప్పి యిర్వురును చేతులు జోడించుకొని, ఊర్ధ్వముఖులై ఏకకంఠముతో “సర్వమజ్ఞళ మాజ్జల్యే శివే సర్వార్థసాధకే, శరణ్యే త్య్రంబకే దేవి నారాయణి నమోస్తుతే” అని స్తుతించి, భక్తిభావము తోడ సాష్టాంగ దండ ప్రణామము చేసి లేచి నిలువంబడిరి.

మహేంద్ర ——(గద్గదకంఠ స్వరముతో) మహామాతయొక్క యిట్టి దివ్యమంగళ స్వరూపమును మఱల నెప్పుడు చూడ వచ్చును!

బ్రహచారి ——ఎప్పుడు మహామాతయొక్క సంతానులందఱును తల్లిని తల్లీ, యని పిలుతురో, అప్పుడు చూడవచ్చును? అప్పుడామె ప్రసన్ను 'రా లగును.

మహేంద్ర——నా పెండ్లము బిడ్డ లెక్కడ నున్నారు?

బ్రహచారి —— నా వెంబడి రా, చూతువు.

మహేంద్ర——వారిని ఒక్కమాఱు చూచి చెప్పి వచ్చెదను.