పుట:Aananda-Mathamu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

ఆనందమఠము


యని తెలిసికొని, 'నీవు మహేంద్ర సింహుని పత్నివా' యనెను. కల్యాణి, నిరుత్తరురాలై తలవంచుకొని, పాలు కాచిన నిప్పును సరిపఱచుకొనుచుండెను. అప్పుడు బ్రహచారి తన ప్రశ్నకు ఉత్తరమువచ్చినదని నిశ్చయించుకొని, “ నేను చెప్పినట్లు చేయుము, పాలుపుచ్చుకొనుము. నీస్వామివృత్తాంతమును తెలిసికొనివచ్చి చెప్పెదను. నీవు పాలు గైకొనకపోయిన నేను పోను" అనేను.

కల్యాణి,ఇక్కడ కొంచెము జలము దొరకునా! యనెను. బ్రహచారి నీళ్లు తెచ్చి యొకసానిక నిండుగాఁ బోసి 'పుచ్చు కొనుము' అనెను. కల్యాణి, ఈజలమున తమపాదముల 'నను గ్రహింపుడు' అనెను. బ్రహ్మచారి, తన అంగుష్ఠము చేత నాజలమును స్పశించెను. తర్వాత, కల్యాణి ఆ జలమును పానము చేసి, “ నేను అమృతపానము చేసినాను,ఇఁక నన్నేమియు పుచ్చుకొనుమని నిర్బంధము చేయఁగూడదు. నాస్వామి వృత్తాంతమునువినక నేనేమియు స్వీకరింపను” అనెను.

బ్రహ్మచారి, 'నీవు నిర్భయముగా నీ దేవస్థానమునందుండుము. నేను నీస్వామివృత్తాంతమును దెలిసికొనివచ్చెడ' అని చెప్పి వెడలిపోయెను.


ఆఱవ ప్రకరణము

భవానందుఁడును మహేంద్రుని వెదకుట కేఁగుట

రాత్రి చాల ప్రొద్దయినది. చంద్రుడు తలమీఁదికి వచ్చెను. పూర్ణచంద్రుఁడు కాదు. వెన్నెల మిగుల ప్రకాశము