పుట:Aananda-Mathamu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

19

మూఁడవ ప్రకరణము


తర్వాత అందఱును బియ్యమే కావలయునుగానీ నగలు వల దనిరి. ఇట్లు మాటల మీద మాటలు పెరిగి తిట్లకు మొదలు పెట్టిరి. వారి యజమాని, అందఱను సమాధానము చేయఁ బ్రయెత్నించెను గాని, ఎవరును అంగీకరింపలేదు. తుదకు తిట్లుపోయి కొట్లకు ప్రారంభించిరి. ఒకఁడు తనకు వచ్చిన నగలను మూట గట్టి యజమానిపై విసరివేసెను. యజమాని ఒకరి నిద్దఱను మర్ధించెను. తర్వాత, అందఱును జేరి యజమానుని గొట్టి గాయపఱచిరి. అధికారి, అన్నా హారములు లేనివాఁడై కృశించి యున్న వాఁ డగుట చేత దెబ్బలకు తాళలేక నేలకు వ్రాలి ప్రాణము విడిచెను. అప్పుడొకఁడు దొంగలను జూచి, 'మన మిదివఱకు కుక్కలనక్కలమాంసమును తింటిమి కదా. నేడు నరమాంసమును దిని బ్రతుకుదము రండు ' అనెను. వేఱోకఁడు 'ఈముండాకొడుకును తప్పక తినవలసినదే' యని చెప్పెను. అంత విశీర్ణ కృష్ణాకార ప్రేతమూర్తులు 'కాళి, కంకాళి, జయకాళి' యని యఱచుచు, కలకలధ్వని చేయుచు, చేతులు తట్టుచు, పటపట పండ్లుకొఱుకుచు, "కాళికి ప్రీతియైన మాంసము లభించినదని చెప్పుచు మహానంద తాండవమాడు చుండిరి. వారిలో నొకఁడు దొంగలరాయని శరీరమును కాల్చుటకై చెత్తను పేర్చి చెకుముకు ఱాతితో నిప్పును కలుగఁ జేసి రగులఁ బెట్టెను. రగులుటకు ప్రారంభించిన కొలఁదిని, ఆవనమందలి మామిడి, పనస, ఖర్జూరము "మొదలగు చెట్ల యొక్క శ్యామల పల్లవరాజి కొంచెము కొంచెముగా గోచర మగుచుండెను. ఒక్కోక చోట ఎండినగడ్డియు ఆకులు నిప్పంటుకొని వెళ్తురు నిచ్చెను. ఒక్కొకచోట అంధకారము మఱంత యధికమా