పుట:Aananda-Mathamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

234

ఆనందమఠము


సత్యానందుని నేత్రములనుండి కన్నీరు ప్రవహింప నారంభించెను. అతఁడు మీఁదనున్న మాతృరూప మైన జన్మభూమి యొక్క ప్రతిమదిక్కు మొగంబై చేతులు మోడ్చికొని బాష్పనిరుద్ధ స్వరముతో “హా ! తల్లీ ! నీ యుద్ధారమును జేయఁ జాలకపోతిని. మరల నీవు మ్లేచ్ఛుల చేతికిఁ జిక్కుదువు, సంతానుల యపరాధమును మన్నింపుము. తల్లీ! యేల రణ క్షేత్రంబున నేఁడు నా ప్రాణములు పోవయ్యెను” అని మొర యిడెను.

చికిత్సక——సత్యానందా! వ్యసనపడవలదు అన్యాయధనముచే రణజయమును బడసితివి. పాపకార్యముచేసి పుణ్య ఫలము గోరిన సిద్ధించునా ? ఇఁక నన్నియు మంచిదే యగును. ప్రకృతమున ఇంగ్లీషు వారు రాజులుగా నున్నారు. ఇఁక ఆర్యధర్మము పునరుద్ధార మగును. ఈ విషయమున మహాత్ములు చెప్పియుండు మాటనే 'నేనును జెప్పెదను. సావధాన చిత్తుండవై వినుము. ముప్పది మూఁడుకోట్ల దేవతలను బూజించుట ఆర్యధర్మము కాదు. అది యొక లౌకికమైన అపకృష్ణ ధర్మము. దాని ప్రభావమే యిప్పటి యార్యధర్మమై యున్నది. మ్లేచ్ఛులు దేనిని హిందూధర్మ మనియెదరో యది లోపమై పోయినది. శుద్ధమైన హిందూధర్మము జ్ఞానాత్మక మైనది. అది కేవలము కర్యాత్మక మైనది కాదు. ఆజ్ఞానము రెండువిధములు. బహిర్విష యిక మైన దోక్కటి. అంతర్విషయిక మైన దొక్కటి. అంతర్విషయిక మైన జ్ఞానమే ఆర్యధర్మ ప్రధాన భాగము. అయినను, బహిర్విషయిక మైన జ్ఞానము "మొదట పుట్టకుండినచో, నంతర్విషయికజ్ఞానము కలుగుట దుర్లభము. స్థూలమును దెలియ కుండినచో సూక్ష్మమును దెలియుట కష్టము. ఇప్పు డీదేశము