పుట:Aananda-Mathamu.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నలుబదినాలుగవ ప్రకరణము

229


శాంతి హృత్పిండముండుచోట ఎదపై చేయి నిడి చూచెను. అచ్చటను గతి లేకుండెను, శరీరమంతయు చల్లనై పోయి యుండెను.

అతఁడు మరల, “ముక్కు నోద్దచేయినుంచి శ్వాస మాడు చున్నదా? లేదా? చూడు" మనెను.

శాంతి చూడఁగా నేమియు నుండ లేదు.

ఆ పురుషుఁడు, “నోట యుష్ణ మున్న దేమో వ్రేలిడి చూడు” మనెను. ఆ విధముగా, నోట వ్రేలిడి చూచెను. “చక్కఁగా దెలియ లేదు' అని చెప్పి భర్త జీవించునేమో యనెడి యాలోచన చేయుచు నేమియు: బలుకక యూరకుండెను.

ఆ మహాపురుషుడు తన యెడమ చేతితో జీవానందుని దేహమును స్పృశించి, “నీవు భయముచే హతాశురాలవై యున్నందువలన నేమియు: దెలియక పోయెను. శరీరమున నింకను ఉష్ణమున్నట్లు కన్పట్టుచున్నది; మరల చూడు"మనియెను.

శాంతి మరల నాడిని బట్టి చూచెసు, నాడికి కొంచెము గతి కలిగెను, విస్తితురాలై యెద పై చేయిడి చూచెను. దడ దడ కొట్టుకొనుచుండెను, ముక్కు నొద్ద వ్రేలిడి చూడఁగా శ్వాస యాడు చుండెను, నోటియందును ఉష్ణము నుండెను. ఆశ్చర్యపరవశురాలై, "ప్రాణ ముండెనో? లేక క్రోత్తగా వచ్చెనో!” యనెను.

అతఁడు, “అట్లుండఁడు; అయినను, నీ వితని నెత్తికొని ఆ కనఁబడు పుష్కరిణి యొద్దకుఁ దేఁగలవా? నేను వైద్యుఁడను, ఇంకను చికిత్స చేయవలయును.” అనెను. '