పుట:Aananda-Mathamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

ఆనందమఠము


కల్యాణి——పురుష వేషముతో నెన్ని దినము లుండవలదును? ఒక్కటిఁగా జేరి మాటలాడుటకుసైతము వీలు లేదు. నీవిట్టి దని నాపతితోఁ జెప్పవలయును.

నవీనానందుఁడు పెద్ద ప్రొద్దు చింతించి యుత్తరమియ్యక యుండెను. పిమ్మట, 'నిజము చెప్పుటవలన బహువిఘ్నంబులు సంభవించు' ననియెను.

ఇరువురు నా సంగతిని గూర్చి మాటలాడఁ దొడంగిరి. ఇంతలో నవీనానందుని యంతఃపురంబు నకుఁ బోఁగూడ దని యాటంకపఱిచిన కావలివారు, మహేంద్రునితో "నవీనానందుఁడు ఆటంకపఱిచినను వినక అంతఃపురమును బ్రవేశించె" నని తెల్పిరి. వెంటనే మహేంద్రుఁ డంతఃపురమునకుఁ బోయెను. కల్యాణి శయ్యాగృహంబునకుఁ బోయి చూడఁగా, నవీనానందుఁడు మంచముదగ్గర నిలుచుకొని యుండెను. కల్యాణి, అతఁడు ధరించి యున్న వ్యాఘ్రచర్మముయొక్క దారము ముడిని విప్పుచుండెను. మహేంద్రుఁ డత్యంతాశ్చర్య మొంది కోపపరవశుఁ 'డాయెను.

నవీనానందుఁ డతనింజూచి నవ్వి——ఏమిగోస్వామి!సంతానులందే నమ్మకము లేదా? యనెను.

మహేంద్రుఁ——భవానంద ఠాకూరు నమ్మకస్థుఁడుగా నుండేనా?

నవీనానందుఁడు కనులంద్రిప్పుచు—— కల్యాణి భవానందుఁడు కట్టుకొనియున్న పులిచర్మము ముడిని విప్పెనా? అని చెప్పుచు కల్యాణీ యొక్క చేతినిదీసి ముడిని విప్పవద్దనెను.

మహేంద్ర——దానివలన నేమి ?